శంషాబాద్ రూరల్, ఆగస్టు 16 : అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని కోత్వాల్గూడలో ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేసి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండి గోపాల్యాదవ్, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు అమృతారెడ్డి, లక్ష్మీశ్రీనివాస్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.