మేడ్చల్ రూరల్, ఆగస్టు 14 : నియోజకవర్గ వ్యాప్తంగా వజ్రోత్సవ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పలుచోట్ల జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపుతూ ర్యాలీ నిర్వహించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పట్టుకొని, దేశభక్తి నినాదాలు చేశారు. బాణాసంచా పేల్చారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, కౌన్సిలర్ బాలరాజు, మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు దేవేందర్, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.
జీడిమెట్ల నుంచి ప్రారంభమై తూప్రాన్ వరకు వెళ్లి, తిరిగి జీడిమెట్లకు చేరుకునే 75 కిలో మీటర్ల తిరంగా యాత్రకు కండ్లకోయ, మేడ్చల్ వద్ద నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కౌన్సిలర్ సముద్రాల హంసరాణి, రాజు, కృష్ణాగౌడ్, సరితారావు, అర్జున్, బాబు, శ్రీనివాస్, రాహుల్, ఆంజనేయులు, మల్లేశ్ యాదవ్, నాగరాజు, వంశీ, నాగసాయి, కేశవరెడ్డి, భరత్, వంశీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో సేయింట్ థామస్ బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి ఆధ్వర్యంలో వజ్రోత్సవాల్లో భాగంగా 250 అడుగుల త్రివర్ణ పతాకంతో 3 కిలో మీటర్ల యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సురేఖ భాస్కర్ గౌడ్, ఫాదర్ తిమోతి, ఫాదర్ కుమార్, పాండు గౌడ్, రాజు ముదిరాజ్, సాయి, లత నరోత్తమ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బద్రీఅరుణ్ గౌడ్ పాల్గొన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా జవహర్నగర్ కార్పొరేషన్లో ప్రజలు ప్రతి ఇంటిపై ఆదివారం జెండా ఎగురవేశారు. పండుగ వాతావరణంలో ప్రజలు స్వచ్ఛందంగా జెండాను ఎగురవేసి వందనం చేశారు.