మణికొండ, ఆగస్టు 6 : విపత్తు సమయంలో డిజాస్టర్వాహనం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. రూ.17లక్షలతో కొనుగోలు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని, రాజకీయాలను పక్కన బెట్టిప్రజాసంక్షేమానికే పెద్దపీట వేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
పత్తు సమయంలో డిజాస్టర్ వాహనం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం 6వ వార్డులోని మహబూబ్ కన్వెన్షన్ ఎదురుగా వైద్య,ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన బూస్టర్ డోసు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్ ఫల్గుణ్కుమార్, టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, లావణ్యనరేశ్, మీనా ము త్యాలు, శ్వేత రవికాంత్‌రెడ్డి, పద్మారావు, కో-ఆప్షన్ స భ్యులు సిద్ధప్ప, తాజుద్దీన్,మాజీ సర్పంచ్ యాలాల నరేశ్, డీఈ దివ్యజ్యోతి, ఏఈ సాయిమౌనిక,మేనేజర్ మ ల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంఘీగూడలో సీసీరోడ్డు ప్రారంభం..
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మండలంలోని సంఘీగూడలో నూతనంగా నిర్మించిన సీసీరోడ్డును శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు,వీధి దీపాలు తదితర సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, వైస్ ఎంపీపీ నీలంమోహన్,ఎంపీడీవో వసంతలక్ష్మి, డీఈ సంజీవరెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్ పద్మావతి అనంతరెడ్డి, సర్పంచ్‌లు దండుఇస్తారి, సతీశ్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, రాజశేఖర్‌గౌడ్, పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ భిక్షపతియాదవ్, వార్డు సభ్యులు గౌతమ్‌బాబు,రాఘవేందర్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి..
ప్రజలు భక్తి భావాన్ని పెంచుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. చిన్నగోల్కొండ గ్రామ సర్పంచ్ గుర్రం పద్మావతి అనంతరెడ్డి ఆధ్వర్యంలో పోచమ్మ, మైసమ్మ ఆలయాలను సంఘీగూడలో నూతనంగా నిర్మించగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలకు ముఖ చిత్రాలుగా ఉన్న పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ దేవాలయాలు లేని గ్రామాలు లేవన్నారు. ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు, మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, సర్పంచ్ సతీశ్‌యాదవ్, నీరటి రాజు, శ్రీకాంత్‌గౌడ్, దేవేందర్‌గౌడ్, చిన్నగోల్కొండ గ్రామ ఉప సర్పంచ్ భిక్షపతియాదవ్, వార్డు సభ్యులు గౌతమ్‌బాబు, రాఘవేందర్, సార మధూరి,సార లక్ష్మి, గుర్రం విక్రంరెడ్డి,నాయకులు వీరయ్య, గోపాల్‌గౌడ్, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.