బేగంపేట్ / చార్మినార్ ;శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని గ్రేటర్ వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే అమ్మవారి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం మొదలుకుని, ఎల్బీనగర్ అష్టలక్ష్మి ఆలయం వరకు మహిళా భక్తుల కోలాహం కనిపించింది. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాయినాలు ఇచ్చుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులకు ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.