గోల్నాక, ఆగస్టు 5 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్‌ఫండ్ పథకం పేదలకు ఆపన్నహస్తంలా మారిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అంబర్‌పేట ఆకాశ్‌నగర్‌కు చెంది న నిఖత్ ఫాతిమాకు రూ. 60వేలు, అంబర్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన టి. రమేశ్‌కు రూ.60వేలు, జైస్వాల్గార్డెన్కు చెందిన పద్మకు రూ.17,500, కాచిగూడ నెహ్రూనగర్‌కు చెందిన ఎన్. రవికి రూ.60వేలు, కాచిగూడ నింబోలిఅడ్డకు చెందిన భరత్‌కు రూ.37,500, అదే ప్రాంతానికి చెందిన హర్షద్పాషాకు రూ.26వేలు, అంబర్‌పేట బాపునగర్‌కు చెందిన రాజేశ్‌కు రూ.32వేలు, గోల్నాక తులసీరాంనగర్కు చెందిన సతీశ్‌కుమార్‌కు రూ.14వేలు, చప్పల్‌బజార్‌కు చెందిన సుగుణకు రూ. 18వేలు, తిరుమలనగర్‌కు చెందిన ప్రసాద్‌కు రూ.7వే లు, ఖాద్రీబాగ్‌కు చెందిన బిస్మిల్లాబేగంకు రూ.10,500, రామచంద్రాపురంకు చెందిన మోక్షకు రూ.లక్ష, గోల్నాకకు చెందిన ఫరీదాకు రూ.40వేలు విలువగల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురై దవాఖానల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి గోల్నాక తులసీనగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆపత్కాలంలో బాధితులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరా రు. కార్యాలయం అధికారులు దగ్గరుండి అన్ని వివరాలు తీసుకొని సులువుగా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారన్నా రు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.