ముషీరాబాద్, ఆగస్టు 5: జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో జోరుగా రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గుంతల రోడ్డు సమస్యలకు తావులేకుండా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు చేపడుతున్నా రు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు. ఇప్పటికే పలు ప్రధా న రోడ్లతోపాటు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇటీవల అడిక్మెట్ డివిజన్లో కొత్త రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాంనగర్ జెడ్బీగార్డెన్, కూరగాయల మార్కెట్ రోడ్ల నిర్మాణపనులను మొదలు పెట్టారు. రూ. 60 లక్షల వ్యయంతో శాశ్వత ప్రాతిపదికన వీడీసీసీ రోడ్డు నిర్మా ణం చేపట్టారు. గత నెలలో ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు. వారం రోజులుగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న అధికారులు వాహనదారుల రాకపోకలకు ఆటంకం కలుగకుండా పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. మొదట రిథమ్బార్-జెడ్బీగార్డెన్ మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఫాతిమా మసీదు, కూరగాయల మార్కెట్లో రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తీరనున్న వాహనదారుల ఇబ్బందులు..
అధ్వానంగా ఉన్న రోడ్లతో గతంలో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడేవారు. రోడ్డు నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రూ.60 లక్షల నిధులు మంజూరు చేయడంతో పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించిన ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణం సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
జాప్యం లేకుండా రోడ్డు నిర్మాణం
వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తాం. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ పనుల వేగం పెంచాం.
–శ్రీనివాస్, ఈఈ జీహెచ్ఎంసీ సర్కిల్-15