జూబ్లీహిల్స్ జోన్ బృందం, జూలై31: దోమల నివారణతోనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని.. పరిసరాల పరిశుభ్రతతో దోమలను అంతం చేయవచ్చని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిముషాలు పరిశుభ్రతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని కోరారు. ఆదివారం నియోజకవర్గంలోని రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్లలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, దేదీప్య విజయ్, సంగీతా యాదవ్‌లతో పాటు డీఎంసీ రమేశ్, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఏఈ సావిత్రి, సూపర్వైజర్లు విజయ్‌కుమార్, హరిప్రసాద్‌తో కలిసి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని దోమల నివారణకు కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయా డివిజన్ల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లో మన్సూర్, శ్రీనివాస్, శీధర్, ఇలియాస్, రవిశంకర్, ధనూజ, రమ, గపూర్, ముబీన్, సుధీర్, మల్లేశ్, విజయ్ కిరణ్, యూసుఫ్‌గూడలో సంతోష్, నర్సింగ్‌దాస్, సత్యనారాయణ, గీతాగౌడ్, కనకయ్య గౌడ్, వేణుగోపాల్, స్రవంతి, అరుణ, నాగరాజు, రజిని, చిన్న యాదవ్, సాయిలక్ష్మి, మన్సూర్, వెంకటేశ్, వెంగళరావునగర్ డివిజన్లో వేణుగోపాల్ యాదవ్, శ్యామ్‌రావు, చిన్న రమేశ్, బాలకృష్ణ.. శ్రీనగర్ కాలనీ డివిజన్లో అప్పూఖాన్, తన్నూఖాన్, మధుయాదవ్, నాగమణి, మారుతి, శివ, అంబిక, శిరీష తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి…
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. ఆదివారం బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో పర్య టించారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకత గురించి ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. బోరబండ కార్యక్రమంలో బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్, హరిప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సయ్యద్సిరాజ్, నేతలు ఆనంద్, ఏడీ మధు, ధర్మ, నర్సింహ, శంకర్, కవిత, పద్మ, సూర్యకళ పాల్గొన్నారు. ఎర్రగడ్డలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, మాజీ కార్పొరేటర్ మ
నీరు నిల్వ ఉండకుండా చూడాలి..
ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్ హేమలత సూచించారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలు ఇండ్లలో నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన చర్యలపై చైతన్య పరిచే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. దోమల నివారణ చర్యలపై జీహెచ్ఎంసీ రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. నాయకుడు లక్ష్మీపతి పాల్గొన్నారు.
ఐడీహెచ్ కాలనీలో ..
న్యూబోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో జీహెచ్ఎంసీ ద్వారా దోమల నివారణ ప్రచార కార్యక్రమాన్ని టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం సూపర్వైజర్ రాజేందర్‌రెడ్డి, ఫీల్డ్ వర్కర్లు సాదిక్, ఎల్లయ్య, అన్సారీ బేగ్ పాల్గొన్నారు.
వ్యాధులను అరికట్టవచ్చు..
పలు రకాల విషజ్వరాలు, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు దోమలను నియంత్రించడం ద్వారా అరికట్టవచ్చని సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి అన్నారు. ఎంటమాలజీ సిబ్బంది ఇళ్లలోని పూలకుండీల కింద, టెర్రస్‌లపై నిలిచిపోతున్న వర్షపు నీరు, డంప్ చేసి ఉంచిన వ్యర్థ వస్తువుల్లో నిల్వ ఉండిపోతున్న నీటిని తొలగించి దోమల నివారణ పిచికారీ పనులు చేపడుతూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ ఇళ్లలో దోమల నివారణ పనులను చేపడితే విషజ్వరాలు నియంత్రించవచ్చన్నారు. ఎంటమాలజీ ఏఈ భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్‌రెడ్డి పాల్గొన్నారు.