సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): గుట్టుచప్పుడు కాకుండా కొకైన్ సరఫరా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసింది. అతడి వద్ద నుంచి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం ఏఈఎస్ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ అజయ్‌రావు, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.పవన్‌కుమార్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం మంగళవారం నిర్వహించిన రూట్‌వాచ్‌లో నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడిని జూబ్లీహిల్స్‌కు చెందిన వినీత్ అగర్వాల్‌గా గుర్తించారు. అతడు ఒక్క గ్రాము కొకైన్‌ను రూ.5వేలకు కొనుగోలు చేసి, కస్టమర్లకు రూ.10వేలకు విక్రయిస్తున్నట్టు అధికారు లు గుర్తించారు. వినీత్ అగర్వాల్ నుంచి 16 గ్రాముల కొకైన్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శివజ్యోతిరెడ్డి, ఎస్సై నరేశ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సత్యనారాయణ, రాజు, రవి, పరమేశ్వర్, సునీత, శిల్పా పాల్గొన్నారు.