ఎల్బీనగర్, జూలై 26 : కొత్తపేట డివిజన్లోని శ్రీరామలింగేశ్వరకాలనీలో అధునాతన పార్కు నిర్మాణం కోసం 2298 గజాల స్థలాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీకి అప్పగించారు. మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టర్ ఆదేశాలతో ఉప్పల్ మండల తాసీల్దార్ గౌతం సంబంధిత ఉత్తర్వుల పత్రాన్ని సరూర్‌నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్యకు అందజేశారు. కొత్తపేట డివిజన్లో అందమైన పార్కును నిర్మించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రామలింగేశ్వర కాలనీలోని స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించేలా ప్రయత్నించి విజయం సాధించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపేట కార్పొరేటర్ పవన్‌కుమార్, ఎల్బీనగర్ మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ లింగాల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వర్రావు, నాయకులు జహీర్‌ఖాన్, శ్రీశైలం గౌడ్, ఉదయ్ గౌడ్, వరుణ్, దీప్లాల్, మల్లెపాక యాదగిరి, కాలనీల ప్రతినిధులు అంజయ్య గౌడ్, రామనాథరెడ్డి, వెంకటరామిరెడ్డి, అశోక్ చారి, సురేశ్ యాదవ్, వాణి తదితరులు పాల్గొన్నారు.