జూబ్లీహిల్స్,జూలై26: దళితబంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. మంగళవారం రహ్మత్‌నగర్‌లో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ధనుజ అనే లబ్ధిదారుకు ఇంటివద్దే వాహనం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, పేదల కోసం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు.
దళితుల్లో పేదరికం అనేది లేకుండా చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని ఈ పథకం ద్వారా దళితులకు ఉన్నతమైన జీవనోపాధిని కల్పించారని కొనియాడారు. లబ్ధిదారుకు ఇంటివద్దే కారును, తాళాలను అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు, షరీఫ్, ఉమర్, నజీర్, లింగమూర్తి, రవిశంకర్, నందు, లింగరాజు, సాబేర్, నర్సింహా, విశాల్, జబ్బార్, గపూర్, తబిత, రమ, విజయ, సోని పాల్గొన్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
దళితబంధు పథకం ద్వారా ఉన్నతమైన జీవనోపాధిని క ల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. దళితబంధు పథకం ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తుంది. కారును అందజేసిన ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్‌కు కృతజ్ఞతలు.
-ధనుజ, లబ్ధిదారు