మన్సూరాబాద్, జూలై 23: వానకాలంలో బండ్లగూడ చెరువు పరిసర కాలనీల్లో వరదనీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడ చెరువు తూము వద్ద అమర్చిన నూతన గేటును శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ్లగూడ చెరువు తూము వద్ద అమర్చిన గేటు వలన వరదనీటిని ఎప్పటికప్పుడు దిగువకు వదిలి ఎగువ ఉన్న కాలనీలు ముంపు కాకుండా చూస్తామని తెలిపారు. బండ్లగూడ చెరువు పరిసర కాలనీలకు వరద ముంపు నుంచి విముక్తి కల్పించేందుకు చేపట్టిన బాక్స్‌టైప్ నాలా పనులు 45 రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ డీఈ వెంకట్ కిరణ్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ పవన్, నాగోల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
శాంతియుతంగా బోనాలు జరుపుకోవాలి..
ప్రజలు శాంతియుత వాతావరణంలో బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్‌లో శనివారం నిర్వహించిన శ్రీకంఠమహేశ్వర స్వామి బోనాల ఉత్సవాలకు మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పాతూరి శ్రీధర్‌గౌడ్, గౌరవ అధ్యక్షుడు పాతూరి చంద్రుడు గౌడ్, సభ్యులు రమేశ్‌గౌడ్, రాజేందర్ గౌడ్, శ్రీనావాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, వెంకటేశ్‌గౌడ్, అమర్నాథ్ గౌడ్, నాయకులు పోచబోయిన జగదీశ్‌యాదవ్, భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.