కందుకూరు, జూలై 23 : కందుకూరు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు పెద్ద రామయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి పనులను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.
చెరువును పరిరక్షించాలి..
అన్నోజిగూడ గ్రామంలో బ్యాటరీ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతున్నదని, దీంతో చెరువులు కాలుష్యంగా మారుతున్నాయని.. ఫ్యాక్టరీని మూసి వేసి చెరువులను రక్షించాలని గ్రామస్తులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వనతిపత్రం సమర్పించారు. ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. తక్షణమే ఫ్యాక్టరీని మూసి వేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు కాకి దశరథ, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ కాకి ఇందిరమ్మ, గొర్రెంకల యాదయ్య, జంగయ్య, కృష్ణ, గణేశ్, రామకృష్ణ, మహేందర్, యూత్ నాయకులు విజ్ఞేశ్వర్‌రెడ్డి, అశోక్ ముదిరాజ్, తాళ్ల కార్తిక్, బొక్క దీక్షిత్‌రెడ్డి, మహిళ అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ డైరెక్టర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.