మల్కాజిగిరి, జూలై 23: దంపతుల మధ్య గొడవతో.. మనస్తాపం చెంచిన ఓ గృహిణి..కూతురును తీసుకొని ఇం ట్లో నుంచి వెళ్లిపోయింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రావు కథనం ప్రకారం.. మౌలాలి రాఘవేంద్రన గర్‌లో నివసించే నవీన్‌కుమార్, లాస్యశ్రీ(27) దంపతులు. వీరికి ఒకటిన్నర సంవత్సరాల నవిక కూతురు. శనివారం ఉద యం దంపతులు కుటుంబ విషయమై గొడవపడ్డారు. మనస్తాపం చెందిన లాస్యశ్రీ.. తార్నాకలో ఉంటున్న తండ్రి సత్యనారాయణకు తెలిపింది. వెంటనే అతను వచ్చి చూడగా.. ఇంటికి తాళంవేసి ఉంది. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.