సిటీబ్యూరో, జూలై 23 (నమస్తేతెలంగాణ) : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్‌వ్యాప్తంగా 218 శిథిల భవనాలు కూల్చివేయగా, మరో 294 భవనాలకు మరమ్మతులు చేపట్టినట్లు బల్దియా అధికారులు తెలిపారు. పురాతన, శిథిల భవనాల తొలగింపునకు సహకరించాలని, ఇప్పటికే ఆయా యజమానులకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 614 శిథిల భవనాలు ఉన్నాయని, ప్రమాదకరమైన భవనాల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో పెండింగ్ ఉన్న 104 పురాతన భవనాలపై స్పెషల్‌డ్రైవ్ కొనసాగిస్తామని వెల్లడించారు.