సుల్తాన్ బజార్, జూలై 23: సబ్బండ వర్గాల సంక్షేమంతో పాటు రాష్ర్టాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హు స్సేనీ అన్నారు.ఈ మేరకు శనివారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆయన శాఖ సభ్యులతో కలిసి లాల్‌దర్వాజ సింహ వాహిని అమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలను చేశారు.
అనంతరం, నాంపల్లి యూసుఫెయిన్ బాబా దర్గాలో చాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తిగా మొదలు పెట్టిన మంత్రి కేటీఆర్ ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ మెహిదీపట్నంలోని సరోజినిదేవి కంటి దవాఖానాలో రోగుల సౌకర్యార్ధం 10 వీల్ చైర్లను ప్రదానం చేశారు. చిరాగ్ అలీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం 150 పళ్లాలు, కూర్చునేందుకు వీలుగా ఉండేలా కుర్చీలు, బెంచీలను పంపిణీ చేయడంతో పాటు గాంధీ దవాఖానకు బీపీ పరీక్షించే 10 పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు చోట్ల హరితహారం కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం, జిల్లా శాఖ కార్యాలయంలో కేక్‌ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్, కురాడి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి ఖలీద్ అహ్మద్, సభ్యులు వైదిక్ శస్త్ర, బి.శంకర్, శ్రీధర్ నాయుడు, రాజ్ కుమార్, కుత్బుద్దీన్, ఏపీ ఆర్వో మహ్మద్ వహీద్, ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణారెడ్డి, రోహిత్ పాల్గొన్నారు.