అబిడ్స్, జూలై 23: తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిరంతరం పాటు పడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నంద కిశోర్ వ్యాస్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం గోషా మహల్‌లోని కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
అనంతరం, నంద కిశోర్ వ్యాస్ మాట్లాడుతూ, రాష్ర్టానికి పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రి కేటీఆర్ అహర్నిశలు పాటు పడుతున్నారని ఆయన సేవల్ని కొనియాడారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజాకర్శక పథకాలుగా నిలిచాయని వివరించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పి.అనిత, పి.నరేందర్ యాదవ్, కోటి శైలేష్ కురుమ, సంతోషి పాల్గొన్నారు.