హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: సాగుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్న ప్రభుత్వం రైతులు గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నదని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (టీఏఎఫ్ఈ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఫార్మ్ అండ్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ సెంటర్’ను వీసీ ప్రవీణ్ రావు, టీఏఎఫ్సీ చైర్మన్ మల్లికాశ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు.
అనంతరం, రఘునందన్‌రావు మాట్లాడుతూ ప్రెసిషన్, డేటా టెక్నాలజీతో కూడిన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కోరారు. ఇదిలా ఉంటే వ్యవసాయ యూనివర్సిటీ వీసీగా ప్రవీణ్‌రావు పదవీకాలం శనివారంతో ముగిసింది. దీంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు వీసీగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం కొత్త వీసీని నియమించే వరకు ఆయనే వీసీగా కొనసాగనున్నారు.