మేడ్చల్ రూరల్, జూలై 23: నిత్య జీవితంలో పోషకాహార పాత్ర కీలకమని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం శనివారం స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ ఉమ్మడిగా ఒక రోజు జాతీయ స్థాయి పోషకాహార సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడి మాట్లాడుతూ, మనిషి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహార ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. నిపుణులు అందించే సలహాలను ఆహార విషయంలో పాటించడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, అధ్యక్షుడు భద్రారెడ్డి, కార్యదర్శి మహేందర్ రెడ్డి, యూనివర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, రిజిస్ట్రార్ ఆంజనేయులు, డైరెక్టర్ చంద్రకాంత్ శిరోలే, సూల్క్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ డీన్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.