మాదాపూర్, జూలై 23 : మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సన్‌రైజ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో శనివారం బీఎన్ఐ(బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్) నెట్ వర్కింగ్ కాన్క్లేవ్-2022 కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ మార్కెటింగ్ గురు ప్రహ్లాద్ కక్కర్ విచ్చేసి బీఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనాషాతో కలిసి బీఎన్ఐ ప్లకార్డు ఆవిష్కరించి మాట్లాడారు. వ్యాపార అభివృద్ధికి మార్కెటింగ్ ఎంతో అవసరమని, కచ్చితమైన ప్రణాళిక, ఓర్పు ఉన్నప్పుడే వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు. నాణ్యత, నమ్మకమే అత్యంత ప్రాధానాంశమని సూచించారు. బీఎన్ఐలో 40వేల మంది సభ్యుల మైలురాయి పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫార్మా, కన్స్ట్రక్షన్, రిటైల్, విభిన్న పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు హాజరై తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు.