జూబ్లీహిల్స్,జూలై20 : టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలలో భాగంగా ఈ నెల 23 వరకు జరుగనున్న జూబ్లీహిల్స్ నాకౌట్ క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లోని ఎన్ఎస్బి నగర్‌లోని క్వారీ ల్యాండ్‌లో నూతనంగా సిద్ధం చేసిన మైదానంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలను మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, సినీ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేషు ప్రారంభించారు. సెమీ ఫైనల్స్ బరిలోకి దిగుతున్న క్రీడాకారులను మైదానంలోకి ఆహ్వానించిన అనంతరం వారు బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు, సినీ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, అడవి శేషులను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చిన్నబాబు, కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, దేదీప్య విజయ్, సంగీతా యాదవ్, మన్నె కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.