చార్మినార్/చాంద్రాయణగుట్ట, జూలై 19: ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా సప్తమాతృకలకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని భాగ్యనగర ఉమ్మ డి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి తెలిపారు. మంగళవారం సుల్తాన్షాహి జగదాంబ ఆలయం నుంచి పోతురాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు మధ్య బంగారు బోనాన్ని భాగ్యలక్ష్మి అమ్మవారికి సమర్పించారు. ఆదివారం జరిగే లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి కూడా బంగారు బోనం సమర్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జోగిని నిషాక్రాంతి చేసిన నృత్యా లు ఆకట్టుకున్నాయి.
ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ: బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బోనాలు అని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. హైదరాబాద్ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు ఆలె భవ్య ఆధ్వర్యంలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ముఖ్యఅతిథిగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జాతీ య బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ హాజరై అమ్మవారిని దర్శించుకొని పూజ లు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్పర్సన్లు రాజ్‌కుమార్, చెన్నబోయిన శివకుమార్‌యాదవ్, బద్రీనాథ్‌గౌడ్, పొసాని సురేందర్ ముదిరాజ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.