పీర్జాదిగూడ, జూలై19 : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం మేడిపల్లి మండల లంబాడీల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వనదేవత సీత్లా భవానీ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వనదేవతలకు సంప్రదాయ పూజలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంట దిగుబడి రావాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమానికి మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు హాజరై పూజలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, హరిశంకర్‌రెడ్డి, సుమన్ నాయక్, బంజారా పెద్దలు రాంకోటి, రాజన్న నాయక్, చందులాల్, భద్రునాయక్, రాజేశ్‌నాయక్, సోమన్, మణిరాంనాయక్, బంజారా మహిళలు పాల్గొన్నారు.