సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆదివారం హైదరాబాద్ పోలీసులు ఒక వైపు సికింద్రాబాద్ బోనాల కోసం బందోబస్తు నిర్వహిస్తూనే మరో వైపు 27 నిమిషాల వ్యవధిలోనే వేర్వేరుగా గుండె, ఊపిరితిత్తులను రాచకొండ ట్రాఫిక్ పోలీసులతో కలిసి వేగంగా జూబ్లీహిల్స్ అపోలో, సికింద్రాబాద్ కామినేని దవాఖానకు తరలించారు. గుండెను ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలో దవాఖానకు 21 కిలోమీటర్ల దూరాన్ని 23 నిమిషాల పాటు గ్రీన్ చానెల్ ద్వారా తీసుకొచ్చారు. ఉపిరితిత్తులను ఎల్బీనగర్ కామినేని నుంచి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖానకు 18 కిలోమీటర్ల దూరాన్ని 23 నిమిషాల్లో చేర్చారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో 21 సార్లు అవయవాలను భద్రంగా తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.