బంజారాహిల్స్, జూలై 17: భారతీయ వైద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా ప్రతి భారతీయ వైద్యుడిని ప్రపంచస్థాయి వైద్య నిపుణుడిగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నదని, ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్(ఆపి) ఇండియన్ కో ఆర్డినేటర్, ప్రముఖ వైద్యులు దువ్వూరు ద్వారకానాథ్‌రెడ్డి సూచించారు. శ్రీనగర్ కాలనీలోని తన్వీర్ హాస్పిటల్లో తన్వీర్ ఫౌండేషన్, ఆపి, ఐఎంఏ హైదరాబాద్ నార్త్ సంయుక్త ఆధ్వర్యంలో 100 మంది మహిళలకు ఉచితంగా సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా. ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ వైద్యులను మరింత నిపుణులుగా మార్చేందు కు చేపట్టాల్సిన చర్యలపై తాము యాక్షన్ ప్లాన్ రూపొందించామని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు వైద్య పరిశోధనా మండలికి అందించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తన్వీర్ ఫౌండేషన్ చైర్మన్ డా. మీగా. ఐఎంఏ నాయకులు డా.సంపత్‌రావు, డా. నవ్నిహాల్ సింగ్, డా.అనుపమ గొటిముక్కల పాల్గొన్నారు.