వరంగల్/ ఐనవోలు, జూలై 17: వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారు, ఐనవోలు మల్లన్నను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఐనవోలులో వారికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర్ రావు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆల య ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భం గా వారు మాట్లాడారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని, ఏర్పాట్లుకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేయడానికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి పరీవాహక ప్రాంతాలకు వెళ్లారన్నారు. ఈ వర్షాల వల్ల రాష్ట్ర, దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగొద్దని మల్లికార్జునస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి ఒక భక్తుడిగా తన వంతు సహకారం ఉంటుందని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తెలిపారు.