ఖైరతాబాద్, జూలై 17: తొలి భూదాన ఉద్యమకారుడు వెదిరె రామచంద్రారెడ్డి చేసిన భూదానం దేశానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ సరిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి.విద్యాసాగర్‌రెడ్డి అ న్నారు. రామచంద్రారెడ్డి 117వ జయంతి సందర్భం గా ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పోస్టల్ శాఖ రూపొందించిన ‘వెదిరె రామచంద్రారెడ్డి స్మారక పోస్టల్ కవర్’, భూదా నం చేస్తూ లిఖిత పూర్వకంగా రాసిచ్చిన ‘స్వదస్తూరి పత్రాన్ని’ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డితో పాటు భూదాన నాయకులు పి.వీరారెడ్డి, డా.తిమ్మారెడ్డి, చైతన్యరెడ్డి, టి.కృష్ణాగౌడ్, సుభాష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, నీలకం ఠ రెడ్డి, ఏ.రవీంద్రచారితో కలిసి ఆవిష్కరించారు.