సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని బస్తీల్లో నివసిస్తున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సుస్థిరమైన జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నది. బస్తీల్లో నివసించే యువత ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ సరైన అవకాశాలు రాక ఉపాధిలో వెనుకబడిపోయారు. వారందరికీ జీహెచ్ఎంసీ చేయూతనందిస్తున్నది. బస్తీల్లోని 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల వారందరికీ స్వయం ఉపాధితో పాటు వివిధ కంపెనీలలో ప్లేస్మెంట్ ద్వారా ఉపాధి కల్పించేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు అనుభవం గల పుణెకు చెందిన లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఎల్‌సీఎఫ్) సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. మొదటగా శేరిలింగంపల్లి జోన్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నది.
లైట్‌హౌస్ సంస్థతో జీహెచ్ఎంసీ ఎంఓయూ చేసుకోవడానికి ఇటీవల స్టాండింగ్ కమిటీ అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండి, కనీస విద్యార్హత గల వారందరికీ లైట్‌హౌస్ సంస్థ వారికి ఇష్టమైన, ఆసక్తి గల రంగాల్లో శిక్షణ ఇచ్చి వివిధ భాగస్వామ్య సంస్థలలో ఉపాధి కల్పిస్తున్నది. ఇంతకు ముందు ఈ సంస్థ పుణె నగర పాలక సంస్థతో ఒప్పందం చేసుకొని వేలాది మందికి ఆయా భాగస్వామ్య సంస్థల ద్వారా, పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు కృషి చేసింది. ఎలాంటి విద్యార్హత లేకపోయినా వారికికూడా స్వయం ఉపాధి పెట్టుకునేందుకు ప్రోత్సాహంతో పాటు అవసరమైన పరిజ్ఞానాన్ని కల్పించి, ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేసింది.
ప్రతి ఏటా 600 మందికి ఉచిత శిక్షణ
లైట్ హౌస్ సంస్థ మహారాష్ట్రలోని పుణె నగర పాలక సంస్థతో కలిసి యువతకు ఆసక్తిగల రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడంతో పాటు జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేసింది. లైట్ హౌస్ ఫౌండేషన్ పుణె మున్సిపాలిటీలో 11వేల మంది నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకోగా 7,200 మందికి ప్లేస్ మెంట్‌తో పాటుగా స్వయం ఉపాధి కల్పించారు. ప్రతి ఏటా సుమారు 600 మందికి సర్టిఫికెట్ కోర్సులలో ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా శిక్షణ కల్పిస్తారు.
1466 బస్తీల్లో విడతల వారీగా అమలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బస్తీల్లో నివసించే యువత జీవన ప్రమాణాలను పెంపొందించాలనే సంకల్పంతో లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఫౌండేషన్ పనితీరును పరిశీలించేందుకు ప్రయోగాత్మకంగా శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టు కింద శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సరిల్ 21పరిధి హుడా కాలనీలోని మోడల్ మారెట్ బిల్డింగ్‌ను కేటాయించారు. మొత్తం 4846 కాలనీల్లో సుమారు 1466 నోటిఫైడ్, నాన్ నోటి ఫైడ్ స్లమ్ ఏరియాలు ఉన్న నేపథ్యంలో విడతల వారీగా అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
ఎన్రోల్మెంట్ అయిన వారికి నైపుణ్యత
ఐటీ, ఐటీయేతర సంబంధించిన ప్రోగ్రాం జావా, సీసీఎన్ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్, నాన్ వాయిస్ బీపీఓ బ్లూ కలర్ కోర్సు, వెబ్ డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వరింగ్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్, రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించిన రిపేరింగ్, ఫొటోగ్రఫీ, మొబైల్ రిపేరింగ్, బేకరీ తయారీ లాంటి ఇతర ప్రోగ్రాములు ఎన్రోల్మెంట్ అయిన వారికి నైపుణ్యత కల్పిస్తారు.
శిక్షణతో పాటు ప్లేస్మెంట్ బాధ్యత వారిదే
నర్సింగ్, కుకింగ్, బ్యూటీ పార్లర్లు, ఫిట్నెస్ ట్రైనర్ సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ సంబంధించిన కోర్సుల్లో శిక్షణ కల్పిస్తారు. అంతేకాకుండా అభ్యర్థులకు ఆసక్తి గల కోర్సులు ఈ సంస్థ వద్ద లేకున్నా వేరే ట్రైనింగ్ సెంటర్‌కు పంపించి, ఫీజు కూడా సంస్థనే చెల్లించి యువతకు శిక్షణ కల్పించేందుకు కృషి చేస్తారు. ఎంపిక నుంచి నైపుణ్యత, శిక్షణతో పాటు ప్లేస్మెంట్ ఇప్పించే వరకు బాధ్యత తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో వివిధ కోర్సుల నిర్వహణకు భాగస్వామ్యం పెద్ద, పెద్ద సంస్థలతో పాటుగా పుణె ప్రాంతంలో లోకల్ స్థాయి సంస్థలతో కూడా భాగస్వామ్యం చేసుకొని ఉపాధి కల్పించారు. హైదరాబాద్‌లో భాగస్వామ్య దిగ్గజ సంస్థలతో పాటుగా అదే విధంగా ఇకడ స్థానికంగా ఉన్న కంపెనీలు, పరిశ్రమలతో భాగస్వామ్యం చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలక్ట్రీషియన్ కోర్సులు
ఎలక్ట్రీషియన్
సర్టిఫికెట్ కోర్సులు,ఎలక్ట్రికల్ వైర్ మెన్ ట్రేడ్, ఎలక్ట్రికల్ సర్వీస్
కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వరింగ్ కోర్సులు
హార్డ్ వేర్ అండ్ నెట్ వరింగ్ సర్టిఫికెట్ కోర్సు
కాంబో-హార్డ్వర్ నెట్వర్కింగ్
మొబైల్ రిపేరింగ్
ఫిట్నెస్ ట్రైనర్ అండ్ న్యూట్రిషన్
న్యూట్రిషన్ ఎక్స్పర్ట్, ఫిట్నెస్ ట్రైనర్ కమ్ న్యూట్రిషన్
ఎక్స్ పర్ట్( కాంబో కోర్సు)
హోం అప్లయన్సెస్ కోర్సు,హోమ్ అప్లయన్సెస్ రిపేరింగ్ కోర్సు(సర్టిఫికెట్)
బ్యూటీ అండ్ వెల్నెస్, బేసిక్ అండ్ బ్యూటీ పార్లర్, బ్యూటీ అండ్ కాస్మోటాలజి
గ్రాఫిక్ అండ్ వెబ్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ ప్రోగ్రామ్, గ్రాఫిక్ డిజైనింగ్, గ్రాఫిక్
డిజైనింగ్ సర్టిఫికెట్ కోర్సు
కేటగిరీ కోర్సులు
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (ఎస్ఎస్ఎఫ్)
లాంగ్ స్టిక్ సెక్టార్ సర్టిఫికెట్ కోర్సు
అకౌంట్ ఎగ్జిక్యూటివ్ (ఎల్సీ)
ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (ఎల్ఆర్)
బీఎఫ్ఎస్ఐ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్
సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్, వెబ్ డిజైనింగ్, జావా ఫుల్ స్ట్రక్, సాఫ్ట్ వేర్ టెస్టింగ్, పైథాన్-టా ఫిట్, కోర్ జావా – టా ఫిట్
వెబ్ డెవలప్మెంట్ : వెబ్ ప్రోగ్రాంతో పాటు పీహెచ్‌పీ, అంగుళర్-టా ఫిట్
నర్సింగ్ అసిస్టెంట్, కేర్, రికవరీ, హోమ్ కేర్, సర్టిఫికెట్ కోర్సులు.