సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెరినిపివ్వని వానతో గ్రేటర్ తడిసి ముైద్దెంది. రాత్రి 9గంటల వరకు కాప్రాలో అత్యధికంగా 1.6 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. అల్వాల్ మచ్చబొల్లారంలో 1.0 సెం.మీలు,కుత్బుల్లాపూర్‌లో 1.0 సెం.మీలు, కుషాయిగూడ, చర్లపల్లిలో 1.0 సెం.మీ లు, మల్కాజిగిరి, షాపూర్‌నగర్, గాజులరామారంలో 8.3మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు గ్రేటర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో..
మేడ్చల్, జూలై11(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మూడుచింతలపల్లి మండలంలో 29.5 మిల్లీమీటర్ల వర్షం పడగా మేడ్చల్ మండలంలో అతితక్కువగా 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.