సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు అవసరమైన ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ వాటా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా సీబీఆర్ఈ వెల్లడించిన రెండో త్రైమాసిక (క్యూ2-2022) నివేదికలో దేశంలోనే మొదటి మూడు నగరాల్లో ఒకటిగా ఉంది. ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ వినియోగంలో బెంగళూరు నగరంలో మొదటి స్థానం, రెండో స్థానంలో ఎన్సీఆర్ ఢిల్లీ, మూడో స్థానంలో హైదరాబాద్ నగరం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, చైన్నె, ఫూణె వంటి నగరాలు ఉన్నాయి. అదే విధంగా సరఫరాలో మాత్రం మిగతా అన్ని మెట్రో నగరాల కంటే అత్యధిక మొత్తంలో 6.1 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఏ గ్రేడ్ ఆఫీస్‌ను సరఫరాకు సిద్ధంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.