ముషీరాబాద్, జూలై 8: ముషీరాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణాలు చేపట్టిన ఘనత తమదేనని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గతంలో ఎప్పడూ లేని విధంగా గుంతల రోడ్లకు తావులేకుండా ప్రతి బస్తీలో రోడ్డు నిర్మాణం చేపట్టామని అన్నారు. శుక్రవారం ఆయన అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ జెడ్బీ గార్డెన్, కూరగాయల మార్కెట్ లైన్లలో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గం చరిత్రలో గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కోట్లాది రూపాయల వ్యయం తో రోడ్డు నిర్మాణాలు చేపట్టిన ఘనత తనదేనని అన్నారు. జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ విశ్వేశ్, టీఆర్ఎస్ నేత ముఠా జయసింహ, అడిక్‌మెట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. సురేందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, మాధవ్, సయ్యద్ అస్లాం, రవియాదవ్, మల్లికార్జున్‌రెడ్డి, అబ్బు, శ్రీకాంత్, ఆకారం శ్రీను, హరీశ్, టైలర్ శ్రీను, టక్కర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్‌కు విస్తృత ఏర్పాట్లు చేయండి..
బక్రీద్ సందర్భంగా నియోజకవర్గంలోని మసీదులు, శ్మశాన వాటికల వద్ద అవపసరమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం లో పలు శాఖల అధికారులతో బక్రీద్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బక్రీద్ జరుగనున్న మసీదులు, శ్మశాన వాటికల వద్ద వీధి దీపాలు, మంచినీరు, రోడ్డు మరమ్మతులు, ఫుట్‌పాత్ నిర్మాణాలు, చెట్ల కొమ్మల తొలగింపుతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా బస్తీల్లో పారిశుధ్య సమస్యకు తావులేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి సీఐలు జాహంగీర్ యాదవ్, సంజయ్‌కుమార్, మోహన్‌రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ పావని, హార్టికల్చర్ అధికారి శ్రీదేవి, జలమండలి డీజీఎంలు చంద్రశేఖర్, వాహబ్, స్ట్రీట్‌లైట్స్ విభాగం అధికారి జ్యోతిర్మయి, టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.