బంజారాహిల్స్/ఖైరతాబాద్/ హిమాయత్‌నగర్,జూలై 2;రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన యశ్వంత్ సిన్హా నగరానికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా గులాబీ శ్రేణులు తరలివెళ్లాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ నుంచి వందలాది బైక్‌లతో ర్యాలీ ప్రారంభించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న రామ్మూర్తితో పాటు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి. వనం సంగీతాయాదవ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్‌తో పాటు సీనియర్ నాయకులు మామిడి నర్సింగరావుతో సహా అన్ని డివిజన్ల టీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై తెలంగాణ నినాదాలతో ప్రధాన రహదారులన్నీ మార్మోగాయి. ఒకవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు దీటుగా యశ్యంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
తెలంగాణ సమాజం ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
ఎనిమేదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంపై అనేక రకాలైన వివక్షను చూపించిన ప్రధాని మోదీని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. బంంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. విభజన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించేలా ప్రధాని మోడీ మాట్లాడారని, రాష్ర్టానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఇవ్వకుండా కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ సమాజం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
జలవిహార్ సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
మిత్రపక్షాల రాష్ట్రపతి అభ్యర్థ్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సభకు ఖైరతాబాద్, సోమాజిగూడ డివిజన్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులు వందలాదిగా బైకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎం. మహేందర్ బాబు, కర్నాటి నాగేశ్వర్ రావు, కె. వరప్రసాద్, గజ్జెల అజ య్, ఆనంద్, వెంకటేశ్, అనిల్ కుమార్, విజయనాంద్, అబ్దుల్ సత్తార్, కిరణ్, సలావుద్దీన్, నాగరాజు, ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.
తరలివెళ్లిన టీఆర్ఎస్ నాయకులు
రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ శనివారం జలవిహార్‌లో నిర్వహించిన సభకు హిమాయత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జె.హేమలతయాదవ్, డివిజన్ అధ్యక్షుడు యాదగిరి సుతారి, నాయకులు జె.వినోద్ కుమార్, పి.ప్రభాకర్‌గౌడ్, డి.రాజేందర్ కుమార్, నందు,అశోక్ కుమార్,కృష్ణ,రామకృష్ణ ,కృష్ణయాదవ్,రాజు తదితరులు పాల్గొన్నారు.