కొండాపూర్, జూన్ 26 : సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్రరెడ్డినగర్కాలనీలో రూ. 4.50లక్షలతో ఏర్పాటు చేసిన 38 సీసీ కెమెరాలను మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, చందానగర్ ఇన్స్పెక్టర్ కాస్ట్రోలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ ఎస్ఐ శ్రీధర్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి..
కొండాపూర్, జూన్ 26 : మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరీనగర్ కాలనీలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
మియాపూర్, జూన్ 26 : శేరిలింగంపల్లి నియోజవకర్గంలోని పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులు అత్యవసర శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.1.80 లక్షల ఆర్థిక సాయం చెక్కులను విప్ గాంధీ ఆదివారం తన నివాసంలో ఎమ్మెల్యే గాంధీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మారెడ్డి, సాంబశివరావు, కాశీనాథ్, శ్రీనివాస్, అష్రాఫ్, పాష, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.