సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: తెలంగాణ రాష్ట్ర పండుగలు విశ్వ వేడుకలుగా కీర్తిని ఆర్జించాయని, విశ్వ వ్యాప్తంగా నేడు మనవైన పండుగల్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాను న్న ఆషాఢం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుందని మం త్రి తలసాని వెల్లడించారు. గోలొండ బోనాల ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం గోలొండ కోట వద్ద కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంసృతికి ప్రతీకగా నిలిచే బోనాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశా రు. మన పండుగలు బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇ ది మనకెంతో గర్వకారణమని తలసాని అన్నారు.
నిఘా నీడలో ఉత్సవాలు…
లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీ న గోలొండ, జూలై 17న లష్కర్, 24న లాల్ దర్వాజ బోనాలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. గోలొండలోని జగదాంబ మహంకాళి అమ్మవారితో పాటు 26 దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. అదే విధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం గోలొం డ వద్ద సీసీ కెమెరాలు, 800 మంది సిబ్బందితో పోలీసు బందోబస్తును ఏర్పా టు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలు..
వాహనాల పారింగ్ కోసం ఎనిమిది ప్రాంతాలను గుర్తించామని, 14 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు వాటర్ వర్స్ ఆధ్వర్యంలో 8.75 లక్షల వాటర్ ప్యాకెట్స్, 55 వేల వాటర్ బాటిల్స్‌ను అందుబాటులో ఉంచినట్టు వివరించారు. నాలుగు అంబులెన్స్‌లు అం దుబాటులో ఉంటాయని, ఐదు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సీవరేజ్ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్ల మరమ్మతులు ఉంటే గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపా రు.
ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం, గో ల్కొండ ఆలయ ఈవో శ్రీనివాస రాజు, కుల వృత్తుల సంఘం అధ్యక్షులు సాయిబాబా చారి, నాయకులు శివశంకర్, శ్రీకాంత్ చారిలు మంత్రిని ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, ఏసీపీ ఆర్జీ శివ మారుతి, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ట్రాన్స్ కో సీజీఎం నరసింహ స్వా మి, వాటర్ వర్స్ ఈఎన్సీ కృష్ణ, దేవాదాయ శాఖ డీసీ రామకృష్ణ, ఏసీ బాలాజీ, ఈవో శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ జడ్సీ రవి కిరణ్, పురావస్తు శాఖ అధికారి రోహి ణి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీ ఎస్ ఈ హఫీజ్, వాటర్ వర్స్ జీఎం నాగేందర్, జిల్లా వైద్యాధికారి డా.వెంకట్, ఆర్టీసీ ఆర్ఎం ప్రసాద్, అగ్నిమాపక శాఖ ఆర్ఎం ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఠాకూర్ జీవన్‌సింగ్ పాల్గొన్నారు.