కొండాపూర్, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి డివిజన్లో రూ.6.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. పరిస్థితులెలా ఉన్న ప్రజా సంక్షేమం, అభివృద్ధిలను విస్మరించేది లేదన్నారు. ప్రతీ కాలనీ, బస్తీలో మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజల అవసరాలను తీరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేశ్, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, సత్యనారాయణ, నరేశ్, సురేందర్, జంగయ్య, రమేశ్, జగదీశ్, గోవింద్, అనిల్, అంజమ్మ, అరుణ, ఇందిరా, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్‌లో నాలా విస్తరణ పనుల పరిశీలన..
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా విస్తరణ పనుల్లో వేగాన్ని పెంచాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ త్రిశూల్ గ్రాండ్ హోటల్ నుంచి దుర్గం చెరువు వరకు చేపట్టిన నాలా విస్తరణ పనులను జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీనివాస్, డీఈ రమేశ్, ఏఈ జగదీశ్, వర్క్ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మెహ్రా, టీపీఎస్ విశాల్, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గంగారం యాదవ్ పాల్గొన్నారు.
గచ్చిబౌలిలో పాదయాత్ర.. కొండాపూర్ డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి న్యూపీజేఆర్ నగర్ కాలనీలో విప్ అరెకపూడి గాంధీ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, కాలనీ అధ్యక్షుడు వెంకట్, కాలనీ వాసులు నరేశ్ ముదిరాజ్, నందు, వెంకట్‌రెడ్డి, కరీం, సాబేర్, వినయ్ పాల్గొన్నారు.
నాలాల విస్తరణను వేగవంతం చేయాలి
నాలాల విస్తరణ పనుల్లో వేగాన్ని పెంచాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయివైభవ్ కాలనీ నుంచి ఎల్లమ్మ చెరువు వరకు కొనసాగుతున్న నాలా నిర్మాణ పనులను కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.
ప్రారంభించిన పనులు..