కందుకూరు, జూన్ 14 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దావుద్గూడ తండాలో సోమవారం పల్లె నిద్ర చేసిన అనంతరం మంగళవారం ఉదయం తండాలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం కల్పించిన వసతులను చూశారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరు వరకు త్రీఆర్స్ (చదవుడం, రాయడం, గణితంలో బేసిక్) నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి. పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, సర్పంచ్ సభావత్ సుమన్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సభావత్ లచ్చానాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని శమంతకమణి, కాకి దశరథ ముదిరాజ్, సురుసాని సురేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, చిర్ర సాయిలు, డైరెక్టర్లు సామ ప్రకాశ్‌రెడ్డి, ఆనంద్, పారిజాతం, మాజీ సర్పంచ్ రాయిచెట్టు యాదయ్య, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్ అశోక్ ముదిరాజ్, విఘ్నేశ్వర్‌రెడ్డి, బొక్క దీక్షిత్‌రెడ్డి, ప్రశాంత్‌చారి, సామయ్య, తాసీల్దార్ ఎస్ జ్యోతి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.
మంత్రికి ఆహ్వానం..
మహేశ్వరం, జూన్ 14: జెన్నాయిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ఠకు రావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంగళవారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలకు చెందిన నాయకులు మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష్మయ్య మాజీ సర్పంచ్ బాట సురేశ్ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నర్సింహ, నాగేశ్వర్‌గౌడ్, నాగేశ్, శ్రీశైలం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పరామర్శ
కందుకూరు. జూన్ 14 : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బొక్క లక్ష్మమ్మ కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. వారి ఇంటికి చేరుకొని ఆమె కుమారులు జిల్లా బీజేపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎంపీటీసీ జ్యోతి, సత్యనారాయణరెడ్డి, భర్త రాంచంద్రారెడ్డితో పాటు కూతురు ప్రభావతిని ఓదార్చి మనోధైర్యం చెప్పారు. అదే విధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా పరామర్శించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూల మాల వేసి ఆత్మకు శాంతి చేకూరలని పేర్కొన్నారు. మంత్రి వెంట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
సీఎం మానసపుత్రిక కల్యాణలక్ష్మి
ఆర్కేపురం, జూన్ 14 : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు సీఎం కేసీఆర్ మానస పుత్రిక పథకం అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆర్కేపురం డివిజన్, సరూర్‌నగర్ డివిజన్లకు సంబంధించిన 124 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వాసవి కాలనీలోని ఆధ్యాత్మిక కేంద్రంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో 6000 వేల మందికి చెక్కులను అందజేశామని చెప్పారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇస్తున్నామన్నారు.
ఆడపిల్లల పెండ్లిలకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు కాన్పులకు దేశంలో ఎక్కడాలేని విధంగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డి, తాసీల్దార్ జయశ్రీ, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్, మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ, బేర బాలకిషన్, వి.రామ్‌నర్సింహ గౌడ్, గొడుగు శ్రీనివాస్, పగిళ్ల భూపాల్‌రెడ్డి, కంచర్ల శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, జగన్మోహన్రెడ్డి, ఎస్కే మహ్మద్, సాజీద్, వెంకటేశ్‌గౌడ్, యాదవరెడ్డి, జగిని రమేశ్, శ్యామ్గుప్త, ఊర్మిలారెడ్డి, సుజాతారెడ్డి, తదితరులు ఉన్నారు.