అబిడ్స్, జూన్ 14: హజ్ యాత్రికుల కోసం నాంపల్లి రెడ్‌రోజ్ ఫంక్షన్ హాల్లో బుధవారం ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు. హజ్ కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, శిబిరానికి హజ్ యాత్రికులు అంతా హాజరు కావాలని, ఈ ట్రైనింగ్ క్యాంపులో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ నుంచి 1822, ఏపీ నుంచి 892 మంది, తమిళనాడు నుంచి కూడా యాత్రీకులు హజ్‌కు వెళ్లనున్నారని.. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర ముగిసే వరకు కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.