చార్మినార్, జూన్ 10; మక్కామసీదు వద్ద ముస్లిం యువకులు బీజేపీ నుంచి సస్పెండ్‌కు గురైన నూపుర్ శర్మ, రాజాసింగ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రవక్త, హజ్రత్ దర్గాలపై అనుచిత వాఖ్యానాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నుపుర్‌శర్మ, రాజాసింగ్‌లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రార్థనల అనంతరం నిరసన కార్యక్రమాలు నిర్వహించే అవకాశముందని ముందస్తుగా గ్రహించిన పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య, టాస్క్‌ఫోర్స్, అదనపు డీసీపీలు చక్రవర్తి గుమ్మీ, రఫీక్ పరిస్థితిని అంచనా వేస్తూ పలు ప్రాంతాల్లో మోహరించారు. నిరసన కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.