కవాడిగూడ, జూన్ 10: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి భోలక్‌పూర్ డివిజన్లోని గంగపుత్ర సంఘం కమ్యూనిటీ హాల్లో డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌రావు నేతృత్వంలో వివిధ పార్టీల నాయకులు కృష్ణ, ప్రదీప్, సుధాకర్, భాస్కర్‌తో పాటు దాదాపు వంద మంది ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, బింగి నవీన్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షుడు ఎ.శంకర్‌గౌడ్, టీఆర్ఎస్ మైనారిటీ కమిటీ రాష్ట్ర నాయకులు జునేద్ బాగ్ధాది, రహీం, భోలక్‌పూర్, ముషీరాబాద్ డివిజన్ల మాజీ అధ్యక్షులు మహ్మద్ అలీ, సయ్యద్ భక్తీయార్, మున్వర్ చాంద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి..
చిక్కడపల్లి, జూన్ 10: ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉన్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రజలకు సేవలందిస్తున్న టీఆర్ఎస్ పారీ సీనియర్ నాయకుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తను ఎమ్మెల్యే సన్మానించారు. మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, గాంధీనగర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్, ఆకుల శ్రీనివాస్, పాశం రవి పాల్గొన్నారు.
లింగాల మౌనికు సన్మానం
ముషీరాబాద్, జూన్ 10: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణ పోటీల్లో బంగారు పతకం సాధించిన లింగాల మౌనికా శ్రీకాంత్ గౌడ్‌ను శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల శ్రీకాంత్ గౌడ్, టి.సోమసుందరం, కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.