ఉప్పల్, జూన్ 4 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాచారంలోని సావర్కర్‌నగర్, బాపూజీనగర్‌లో అధికారులతో కలిసి కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్ శనివారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించి, తక్షణం మరమ్మతు పనులు, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాలనీలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, కాలనీవాసుల సహకారంతో డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సురేందర్, ఏఈ దయ, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, జలమండలి వర్క్ఇన్స్పెక్టర్ మనోహర్, కాలనీ అధ్యక్షుడు శుక్ల, జయరాజ్, నేతలు సాయిజెన్ శేఖర్, మేకల ముత్యంరెడ్డి, కట్ట బుచ్చన్న, కృష్ణారెడ్డి, సంతోష్, వేణు పాల్గొన్నారు. ఉప్పల్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆదేశాల మేరకు న్యూభరత్‌నగర్, ఇందిరానగర్, రాఘవేంద్రనగర్కాలనీలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కాలనీవాసులు, నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈ నిఖిల్‌రెడ్డి, ఏఈ వసంత, జలమండలి ఏఈ సత్యనారాయణ, జ వాన్లు ముఖేశ్, జగన్, వర్క్ఇన్స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, కృష్ణ, బాలరాజు, నేతలు మస్కా సుధాకర్, అన్య వెంకటేశ్, టంటం వీరేశ్, వే ముల వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, పంగ మహేందర్‌రెడ్డి, వంశీ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్ పరిధిలో..
చర్లపల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్‌నగర్, భాగ్యనగర్ కాలనీ, మీనాక్షినగర్, శుభోదయనగర్, రెడ్డి కాలనీ, భగవాన్ కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి నోడల్ అధికారిణి ఉషాతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ వర్క్స్ యూజీడీ డీజీఎం సతీశ్, ఎలక్ట్రికల్ ఏఈ ప్రత్యూష, ఎస్పీడీసీఎల్ ఏఈ మనోహర్, అధికారులు అజయ్, నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, బత్తుల శ్రీకాంత్‌యాదవ్ పాల్గొన్నారు.
కాప్రా డివిజన్ పరిధిలో..
కాప్రా డివిజన్ పరిధిలోని డీఎంఆర్ ఎంక్లేవ్, రాజరాజేశ్వరినగర్కాలనీల్లో కార్పొరేటర్ స్వర్ణరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. ఏఈఈ అభిషేక్, టీఆర్ఎస్ నాయకులు కొప్పులకుమార్, గిల్బర్ట్, భిక్షపతి, మచ్చపాండు, గణేశ్, చందు, శివలింగం, మల్లారెడ్డి, దేవి, సరిత, రేఖ, కాలనీ ప్రతినిథులు పాల్గొన్నారు.
రామంతాపూర్ డివిజన్లో..
రామంతాపూర్ డివిజన్ లో అధికారులు, కార్పొరేటర్లు బండారు శ్రీవాణి నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. నోడల్ అధికారి వెంకటరమణ, ఏఈ జ్యోతి,మేనేజర్ ప్రభాకర్‌రెడ్డి, ఏఈ రాములు, జలమండలి సూపర్ వైజర్ కిషన్, నాయకులు బండారు వెంకట్రావు, జగదీశ్,బాలకృష్ణ,కుమారస్వామి,తిరుపతయ్య,సుబ్బరామయ్య,తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి..
పట్టణ ప్రగతిలో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితాకిశోర్ అన్నారు. శనివారం వెంకటాపురం డివిజన్లో పట్టణ ప్రగతిలో భాగంగా డిప్యూటీ కమిషనర్ నాగమణి, నేరేడ్మెట్ డివిజన్లో కార్పొరేటర్ మీనాఉపేందర్ రెడ్డి, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ ఆయా డివిజన్లలో రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లపై ఉన్న మట్టిని తొలగించడానికి జేసీబీతో పాటు వాహనాలు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. నాలాల పూడికతీత, ప్రమాదాలు జరుగకుండా చర్యలు, మ్యాన్‌హోల్స్ పరిస్థితిని పరిశీలించి శిథిలావస్థకు చేరిన వాటిని తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. గౌతంనగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, విద్యుత్, జలమండలి విభాగం అధికారులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అల్వాల్ డివిజన్లోని ప్రశాంత్ నగర్, న్యూ రెడ్డి ఎన్‌క్లేవ్‌లో కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. కార్యక్రమంలో డీసీలు రాజు, నాగమణి, ఈఈలు లక్ష్మణ్, రాజు, డీఈ మహేశ్, ఏఈలు శ్రీకాంత్, అరుణ్, వాటర్‌వర్క్స్ జీఎం శ్రవంతి, మేనేజర్లు సతీశ్, మల్లికార్జున్, శ్రీవాణిరెడ్డి, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మీనా ఉపేందర్‌రెడ్డి, శ్రావణ్, నాయకులు అనీల్కిశోర్, ఉపేందర్‌రెడ్డి, అంజయ్య, ప్రసాద్, రాజేశ్కన్న, భాస్కర్, జనార్దన్, మోసిన్, ప్రభాకర్, సత్యనారాయణ, ఏఈ దివ్యజ్యోతి, శానిటేషన్ సూపర్వైజర్ మనోహర్‌రెడ్డి, నాయకులు రాముయాదవ్, రవీంద్రరావు పాల్గొన్నారు.