దుండిగల్ జూన్1: దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్‌పల్లిలోని గ్రీన్‌హిల్స్ హౌసింగ్ కాలనీలో బుధవారం నిర్వహించిన శివాలయ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే వివేకానంద్, మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణలు, వైస్ చైర్మన్ పద్మారావులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఈ భూమి పూజలో మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, భరత్‌కుమార్, సత్యనారాయణ, ఆనంద్, డప్పు కిరణ్‌కుమార్‌లతో కలిసి భూమి పూజ చేశారు. మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు విజయరామిరెడ్డి, పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, శంకరయ్య, నాయకులు మైసిగారి వెంకటేశ్, మల్లేశ్ సగ్గిడి శ్రీనివాస్, జెమ్మి దేవేందర్, సోమేశ్యాదవ్, సిద్దిరాములు తదితరులు ఉన్నారు.