అబిడ్స్/ మెహిదీపట్నం, జూన్ 1 : తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో అభివృద్ధి చోటు చేసుకున్నది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాడవాడలా , గ్రామగ్రామాన, నగరంలోని వీధివీధినా అభివృద్ధి పనులు జరిగేలా పథకాలను చేపట్టారు. గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో పనులను చేపట్టారు. రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణం, హై మాస్ట్ లైట్ల ఏర్పాటు, ఎల్ఈడీ వీధి దీపాలు, ఫ్లై ఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మార్కెట్లనిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి, కార్పొరేట్ దవాఖానలను తలపించే విధంగా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దడం, మెట్రో రైలు ఇలా అనేక అభివృద్ధి పనులను చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు దక్కింది.
సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం చోటు చేసుకుందని ప్రజలు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్నారని కొనియాడుతున్నారు.
సుల్తాన్‌బజార్, పుత్లిబౌలి, నాంపల్లిల మీదుగా మెట్రో రైలు సౌకర్యం.
మొజాంజాహి మార్కెట్ మున్సిపల్ కాంప్లెక్స్ అభివృద్ధి
బేగంబజార్‌లోని చేపల మార్కెట్ పునరుద్ధరణకు ఆధునిక హంగులతో మార్కెట్ నిర్మాణ పనులు
విద్యుత్ దీపాలతో జిగేల్మంటున్న మొజాం జాహి మార్కెట్ మున్సిపల్ కాంప్లెక్స్
అఫ్జల్‌గంజ్ నుంచి బషీర్‌బాగ్ వరకు విద్యుత్ స్తంభాలకు జిగేల్మనిపించే వీధి దీపాల ఏర్పాటు
ట్లాది రూపాయల వ్యయంతో జాంబాగ్, బేగంబజార్, మల్లెపల్లిలో మోడల్ మార్కెట్ల నిర్మాణం
ప్రధాన రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణ పనులు
ఎన్ఎండీసీ, మహావీర్ దవాఖానల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు
మెహిదీపట్నం బస్‌స్టాపులో అండర్ పాస్ రోడ్డు నిర్మాణానికి చర్యలు
మూడు నియోజకవర్గాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటు
బోజగుట్ట, జియాగూడ, కట్టెలమండి, గోడేకిఖబర్, శివలాల్‌నగర్, మురళీధర్బాగ్లలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు
నాంపల్లి, హుమాయూన్‌నగర్, ఆసిఫ్‌నగర్, గోల్కొండ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణం
టోలిచౌకి ఫ్లైఓవర్ నిర్మాణం.
టోలిచౌకి నుంచి హకీంపేట్ మార్గంలో బ్రిడ్జి నిర్మాణం.
జుమ్మెరాత్‌బజార్‌లో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణాలు
సిత్లామాత శ్మశాన వాటిక, ఇతర ప్రాంతాల్లో శ్మశాన వాటికల అభివృద్ధి
కార్వాన్ నియోజకవర్గంలో సీవరేజీ లైన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధుల విడుదల