భోలక్‌పూర్ డివిజన్ పరిధిలోని కవాడిగూడ, గాంధీనగర్ ప్రధాన రహదారిలో ఉన్న కోదండరెడ్డి పార్కు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.80 లక్షలు మంజూరు చేసింది. అధికారులు కొన్ని నిధులను మాత్రమే వెచ్చించి పార్కులో బోర్ రిపేరింగ్, పాత్‌వేల ఏర్పాటు, రూం రిపేరింగ్, కర్బింగ్ ఏర్పాటు, బల్లలు, చెత్తాచెదారం పార్కులోకి రాకుండా జాలీలు, ఇంటర్‌లాకింగ్ టైల్స్‌ను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. సర్కార్ నిధులు మంజూరు చేసిన అధికారులు పార్కును అభివృద్ధి చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం,సాయంత్రం వాకింగ్‌కు వచ్చే ప్రజలు, ప్రధానంగా వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. పార్కు అందుబాటులో ఉన్నా.. ఉపయోగంలో లేకపోవడంతో అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా పార్కులో కనీస వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరుతున్నారు. అయితే, త్వరలోనే పార్కును అభివృద్ధి చేస్తామని భోలక్‌పూర్ హార్టీకల్చర్ అసిస్టెంట్ వెంకటేశ్ అన్నారు.
– కవాడిగూడ, జూన్ 1