సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ప్రేమను పంచాలన్నా.. పొందాలన్నా మధ్యలో బహుమతి పాత్ర ప్రత్యేకం. ఒకప్పుడు మార్కెట్లో దొరికే గిఫ్ట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. సర్ప్రైజ్ సెలబ్రేషన్ ట్రెండ్ నడుస్తోంది. కస్టమైజ్డ్ గిఫ్టింగ్ పేరుతో అభిరుచులకు, ఆలోచనలకు తగ్గట్లుగా గిఫ్ట్స్‌ని తయారు చేయించి అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ గిఫ్ట్‌లకు మంచి క్రేజ్ ఉంది. గిఫ్ట్‌లపై రకరకాల సందేశాలు రాయిస్తూ ప్రేమను వ్యక్తపరిచేందుకు పోటీపడుతున్నారు. ఈ గిఫ్ట్ ట్రెండ్‌ను కొంతమంది మహిళలు తమ ఉపాధిగా మలుచుకుంటున్నారు. స్టార్టప్‌లు స్థాపించి ఇంటి నుంచే కస్టమైజ్డ్ గిఫ్ట్‌లను రూపొందిస్తూ అందరి మన్నన్నలు పొందుతున్నారు. పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, బిస్కట్లు, అమ్మాయిలకు నచ్చే బ్యాగులు, వాచీలు.. యువకులు మెచ్చే టీషర్ట్స్.. కపుల్ డాల్స్..వెడ్డింగ్ హూప్స్ ఇలా విభిన్న స్టయిల్స్లలో అందరికీ ఇష్టమయ్యే గిఫ్ట్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఎలా కావాలో చెబితే చాలు
గిప్ట్స్ అనేక రకాలు. ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎలా ఇస్తే బాగుంటదని ఆలోచిస్తున్నారు? ఈ విషయాలు మాకు చెబితే అందుకు తగ్గట్టుగా బహుమతులు రూపొందిస్తాం. ఇప్పుడు చాలా వరకు కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ట్రెండ్ నడుస్తుంది. కస్టమర్ ఎలా కోరుకుంటారో అలా గిఫ్ట్స్ తయారుచేస్తున్నాం. 9030329303 నంబర్‌కు ఫోన్ చేసి మీకు కావాల్సిన గిప్ట్ తయారీ వివరాలు అందిస్తే చాలు. వచ్చే నెల నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో లంచ్‌బాక్స్‌లు, బ్యాగులు పిల్లలకు నచ్చేలా వారి ఫొటోలను అమర్చి అందిస్తున్నాం. వాటికి చాలా డిమాండ్ ఉంది. ఓ వైపు ఇంటి బాధ్యత చూసుకుంటూనే మరోవైపు స్వప్న క్రియేషన్స్ నడుపుతున్నాను.
– స్వప్న, ఉమెన్ ఎంట్రప్రెన్యూర్
రసాయనాలు లేని సబ్బులు..
ఎలాటి రసాయనాలు లేని ఆరోగ్యకరమైన సోప్స్‌ను తయారు చేస్తున్నాం. వాటికి చాలా డిమాండ్ ఉంది. సోషల్ మీడియా వేదికగా మా బిజినెస్ నడుస్తుంది. మా కస్టమర్లలో నెటిజన్లు అధికంగా ఉంటారు. అయితే ఆ సోప్స్‌ను అందరికీ నచ్చేలా ముఖ్యంగా పిల్లలు ఇష్టపడేలా విభిన్న రకాల్లో రూపొందిస్తున్నాం. వారికి నచ్చిన కార్టూన్స్ ఆకారాల్లో తయారు చేసి అందిస్తున్నాం. చాలా మంది మేం తయారు చేసిన సోప్స్‌ను బహుమతులుగా కూడా అందిస్తున్నారు.
– దీప్తి, ఎంట్రప్రెన్యూర్
మీకు నచ్చే ఆభరణం
ఇప్పుడు జువెల్లరీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. అయితే మార్కెట్లో చాలా రకాల జువెల్లరీ అందుబాటులో ఉంది. అయితే మేం ఆ జువెల్లరీని కస్టమర్లు ఏ విధంగా కోరుకుంటున్నారో అలా తయారు చేసి అందించడం మా ప్రత్యేకత. ఆభరణాల్లో పొదిగే స్టోన్స్ ఆకారం కూడా కస్టమర్ కోరుకున్న విధంగానే అద్దుతాం. అందులో పేర్లు రాయడం.. నచ్చిన గుర్తులను పొందుపర్చడం చేస్తాం. మా వర్క్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రచారం కల్పిస్తాం. నచ్చినవారు మమ్మల్ని సంప్రదించి ఆర్డర్స్ ఇస్తుంటారు. 8688293409 నంబర్‌కు ఫోన్ చేసి మీకు నచ్చిన ఆభరణాలు రూపొందించుకోవచ్చు.
– కుసుమ, రెసిన్ జువెల్లరీ