వ్యవసాయ యూనివర్సిటీ, మే 18 : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సమస్యలకు ప్రత్యేక నిధులు కేటాయించినప్పటికీ అధికారుల జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని సులేమాన్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ నయీం అన్నారు. బుధవారం టీఆర్ఎస్ బృందం కాలనీలలోని పలు సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. చింతల్మేట్ ప్రధాన రహదారి నుంచి బావర్చి హోటల్ వరకు డ్రైనేజీ పారుతున్నదని తెలిపారు. డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సయ్యద్ ఇస్సాఖొద్దీన్, బాబా, ఎండీ ఫయాజ్ ఖాన్, సురేశ్ పాల్గొన్నారు.