మేడ్చల్, మే 17 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రకృతి వనాలు పచ్చందాలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో 227 పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిన అధికారులు ఏడు విడుతల్లో నిర్వహించిన హరితహారంలో భాగంగా 464741 మొక్కలు నాటారు. అంతేకాక 61 గ్రామ పంచాయతీల్లో 81 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ.49.76 లక్షల నిధులను ఖర్చు చేశారు. ప్రస్తుతం ఇక్కడ పెరుగుతున్న మొక్కలు శివారు ప్రాంత వాసులకు కనువిందు చేస్తున్నాయి.
పట్టణ ప్రకృతి వనాలు..
బోడుప్పల్(కార్పొరేషన్) : 17
నిజాంపేట్(కార్పొరేషన్) : 09
పీర్జాదిగూడ(కార్పొరేషన్) : 22
జవహర్నగర్(కార్పొరేషన్) : 06
దమ్మాయిగూడ(మున్సిపాలిటీ) : 18
దుండిగల్(మున్సిపాలిటీ) : 42
ఘట్కేసర్(మున్సిపాలిటీ) : 18
గుండ్లపోచంపల్లి(మున్సిపాలిటీ) : 15
కొంపల్లి(మున్సిపాలిటీ) : 14
మేడ్చల్(మున్సిపాలిటీ) : 23
నాగారం(మున్సిపాలిటీ : 15
పోచారం(మున్సిపాలిటీ : 18
తూంకుంట(మున్సిపాలిటీ : 10