హైదరాబాద్ ఆట ప్రతినిధి, మే 16: తెలంగాణ ఆల్ఫైల్స్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా బి.చందర్రావు ఎంపికవగా, ప్రధాన కార్యదర్శిగా కన్నన్ గౌడ్ ఎన్నికయ్యారు. ఏఎస్ రావు నగర్ టస్మో ఇండియా చైర్పర్సన్ సత్యశంకర్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఆల్ఫైల్స్ మార్షల్ ఆర్ట్స్ కరాటే (టస్మో) అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్కింగ్ అధ్యక్షుడిగా ప్రవీణాచారి, గౌరవ అధ్యక్షులుగా ప్రమోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా బూడిద సైదులు, కురుకు శ్రీనివాస్, జి.కృష్ణ, కట్టా దయాకర్ నిర్వాహక కార్యదర్శి అల్కాపురి సురేశ్ కోశాధికారిగా మరిపల్లి రమేశ్‌లు ఎన్నుకున్నారు. ఎగ్జిక్యూటివ్ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఏసీ గౌతమ్ కుమార్, జి.వెంకటేశ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.రోహిత్ కుమార్, పి.తేజస్విని, పి.సాయిరాజ్ పాల్గొన్నారు.