ఎల్బీనగర్, మే 16 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే గడ్డిఅన్నారం టిమ్స్‌తో పాటు పరిసరాల్లోని పోలీస్‌స్టేషన్, పార్కు, సబ్‌స్టేషన్, వాటర్ రిజర్వాయర్ల నిర్మాణాల డిజైన్ల తయారీకి ఆర్కిటెక్ట్ సుమేర్దార్తో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో 1000 పడకల దవాఖానతో పాటుగా ఎకరం స్థలలో పార్కు, 3 వేల గజాల స్థలంలో పోలీస్‌స్టేషన్, 2వేల గజాల స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్, వెయ్యి గజాల స్థలంలో నూతన రిజర్వాయర్ నిర్మించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఆర్కిటెక్ట్ సుమేర్దార్ గడ్డిఅన్నారానికి వచ్చి ఎమ్మెల్యేతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
ఈ నెల 24వరకు డిజైన్లు తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, చైతన్యపురి సీఐ రవికుమార్, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త, కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అనంతుల రాజారెడ్డి, లింగాల రాహుల్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, తోట మహేశ్‌యాదవ్, నర్సిరెడ్డి, మార్కెట్ మాజీ డైరెక్టర్ నాగలక్ష్మీ, జయశ్రీ, జహీర్‌ఖాన్, పాండుగౌడ్, భూపేశ్‌రెడ్డి, శరత్చంద్ర, కడియం మోహన్‌రాజ్, నరేందర్‌రెడ్డి, జలందర్, కిషన్, నజీర్, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సూచనలు
టిమ్స్‌లో సోలార్ పవర్, 600 కార్లకు పార్కింగ్,ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ ఏర్పాట్లు
చైతన్యపురి మెట్రోస్టేషన్ నుంచి దవాఖానకు వచ్చేలా ర్యాంపు, ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలి
నర్సింగ్ కాలేజీ, హాస్టల్, రెసిడెంట్ డాక్టర్స్‌కు భవనాలు
ప్రస్తుతం ప్రభాత్‌నగర్ వెళ్లే ప్రధాన మార్గంలో పోలీస్‌స్టేషన్, దాని వెనుకే పార్కు
మార్కెట్ వెనుక గేటు ప్రాంతంలో రిజర్వాయర్, సబ్‌స్టేషన్ ఉండాలి
ఆసుపత్రిలోని వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి వాటిని మొక్కలకు, ఏసీ చిల్లర్స్కు, బాత్ రూంలలో ప్లషింగ్లకు ఉపయోగించాలి.
చెత్త వేస్ట్ , బయోవేస్ట్లను కూడా రీసైక్లింగ్ చేయాలి.
రోగుల బంధువులకు షెల్టర్ హోంలు నిర్మాణం