సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : నేర నియంత్రణ చాలా ముఖ్యమని, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీ సు కమిషనరేట్ కార్యాలయం లో బుధవారం సీపీ స్టీఫెన్ రవీం ద్ర క్రైమ్ విభాగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసులో నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తు కొనసాగాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల వారీగా నేరాలపై సమీక్ష జరిపారు. పెండింగ్ కేసులు, రికవరీ రేటు తగ్గిన పోలీసుస్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు రివార్డులను అందించారు. సమావేశంలో క్రైం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, డీసీపీ ఇందిర, ఏడీసీపీ నరసింహారెడ్డి, ఇన్స్పెక్టర్లు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.