కాప్రా,మే10:కాప్రాసర్కిల్లో ఈ ఏడాది (2022 -2023)కి సంబంధించి ఎర్లీబర్డ్ (ముందస్తు) ఆస్తిపన్ను చెల్లింపులు రికార్డుస్థాయిలో జరిగాయి. ఏప్రిల్ 30తో ఎర్లీబర్డ్ చెల్లింపులు ముగిసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 5శాతం రాయితీతో గృహస్తులు వివిధ మార్గాల ద్వారా తమ ఆస్తిపన్ను చెల్లించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం 32,572 ఆస్తుల నుంచి రూ.2414.70లక్షలు (రూ.24.14కోట్లు) ఎర్లీబర్డ్ ఆస్తిపన్ను వసూలైనట్లు సర్కిల్ రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఆరేండ్లుగా జరిగిన వసూళ్ల్లను పోలిస్తే ఈ ఏడాది పన్ను చెల్లింపుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించినట్టు దీంతో స్పష్టమవుతున్నది. ఏడాది అంతా జరిగే ఆస్తిపన్ను వసూలు దాదాపు రూ. 46కోట్లు ఉంటుండగా, ఒక్క ఏప్రిల్లోనే రూ. 24.14 కోట్ల పన్ను వసూలు కావడం సిబ్బందినే ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎర్లీబర్డ్ వసూళ్లు ఇలా….
సర్కిల్ కార్యాలయంలోని పౌరసేవాకేంద్రంలో 4243 ఆస్తుల నుంచి రూ.260.64లక్షల ఎర్లీబర్డ్ ఆస్తిపన్ను చెల్లింపులు జరుగగా, బిల్కలెక్టర్ల ద్వారా 3216 ఆస్తుల నుంచి రూ.10 55.87లక్షల ఆస్తిపన్ను వసూలైనుట్ల సర్కిల్ వర్గాలు తెలిపాయి. మీసేవా కేంద్రాల నుంచి రూ.3462 ఆస్తుల నుంచి రూ.133.35 లక్షలు, ఆన్లైన్ ద్వారా 21,651 ఆస్తుల నుంచి రూ.964.84లక్షలు మొత్తం 32572 ఆస్తుల నుంచి రూ.2414.70లక్షలు (రూ.24.14కోట్ల) ఆస్తిపన్ను వసూలు అయింది.
పన్నులు చెల్లించినందుకు ధన్యవాదాలు
ఎర్లీబర్డ్లోభాగంగాఆస్తిపన్ను చెల్లింపుల కార్యక్రమాన్ని సర్కి ల్ ప్రజలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఆస్తిపన్నులు సకాలంలో చెల్లించి సర్కి ల్ అభివృద్ధికి తోడ్పాటు అం దించిన ప్రతి ఆస్తిపన్ను చెల్లింపుదారులకు, సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు. -ఎన్.శంకర్, డీసీ, కాప్రాసర్కిల్