కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యంగా మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ ధనలక్ష్మీ సెంటర్లో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలో డ్రైనేజీ పనులను, అదనపు తరగతి గదుల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పాఠశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని విద్యార్థులు ఆడుకునేలా అభివృద్ధి చేయాలన్నారు. పాఠశాల స్థలంలోకి రహదారిని ఏర్పాటు చేసుకుని దైనందిక జీవితాలు గడుపుతున్న వారికి నోటీసులందించాలని.. ఆ ప్రాంతంలో ప్రహరీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేయూతనందించే దిశగా నోట్‌బుక్స్, కంపాస్ బాక్స్, స్కూల్ బ్యాగ్‌తో కూడిన కిట్టును అందజేస్తున్నట్లు తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని మహిళ, చిన్నారుల పార్కులో అసంపూర్తి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే కృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం మహిళా పార్కును అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఓపెన్ జిమ్ పనులను పూర్తి చేయాలని, పార్కులో అక్కడక్కడా మిగిలిపోయిన పనులను పూర్తిచేసి ప్రజలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, బాలాజీనగర్ డివిజన్ ఇన్చార్జి సాయిబాబా చౌదరి, కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఏఈ సాయిప్రసాద్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
అల్లాపూర్,జూలై29: అల్లాపూర్, మోతీనగర్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉచితంగా నోట్పుస్తాకాలను నేడు (శనివారం) పంపిణీ చేయనున్నారు. వర్షం పడే అవకాశం ఉండడంతో స్థానిక ఫంక్షన్‌హాళ్లలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్పొరేటర్ సబీహాబేగం తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కార్పొరేటర్ పరిశీలించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పర్యావరణ హితంకోసం మట్టి వినాయకుడినే పూజించాలని ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, పల్లి తిరుపతి, జహెద్ ఫరీఫ్బాబా, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రాముయాదవ్ తదితరులు పాల్గొన్నారు.